- Advertisement -
భారత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టును పంపించాలా వద్దా అనే విషయంపై చర్చించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. పాక్ జట్టును భారత్‌కు పంపించే విషయంలో ఆ దేశ ప్రభుత్వం ఆచీతుచీగా వ్యవహరిస్తోంది. జట్టు భద్రత విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే నిర్ణయంతో పాక్ ప్రభుత్వం ఉంది.
దీంతో ఈ విషయంలో అత్యున్నత కమిటీ సలహాలు, సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో కనిపిస్తోంది. అయితే కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: అఫ్గానిస్థాన్‌కు సిరీస్
- Advertisement -