Wednesday, January 22, 2025

నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్థాన్..

- Advertisement -
- Advertisement -

సిమ్లా: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన అఫ్గాన్ కు శుభారంభం దక్కింది. తొలి వికెట్ కు ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బజ్, ఇబ్రహీం జార్డన్ లు కలిసి 47 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత ఇబ్రహీం, 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా(18), అష్మతుల్లా(18)లు విఫలమయ్యారు. ఆ వెంటనే ఓపెనర్ రెహ్మనుల్లా(47) కూడా ఔట్ అయ్యాడు. 112 పరుగులకే అఫ్గాన్ 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం అఫ్గాన్ జట్టు 26 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News