Thursday, January 23, 2025

ఇలాంటి టీమ్‌తో ట్రోఫీ సాధించడం కష్టమే

- Advertisement -
- Advertisement -

కరాచీ: సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో ట్రోఫీని గెలుచుకోవడం ఆతిథ్య టీమిండియాకు అంత తేలికకాదని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు అంతగా బలంగా కనిపించడం లేదన్నాడు. గతంతో పోల్చితే ప్రస్తుత టీమిండియా అన్ని విభాగాల్లో బలహీనంగా ఉందన్నాడు. ధోనీతో పోల్చితే రోహిత్ శర్మ కెప్టెన్సీ అంతంత మాత్రమేనని అభిప్రాయపడ్డాడు. జట్టును ముందుండి నడిపించడంలో రోహిత్ ఆశించిన స్థాయిలో సఫలం కావడం లేదన్నాడు. ఇందుకు ఐసిసి టోర్నమెంట్‌లలో టీమిండియా ప్రదర్శనే నిదర్శనమన్నాడు. అయితే తాను రోహిత్ కెప్టెన్సీని తక్కువ చేసి చూడడం లేదన్నాడు.

ఉన్న వాస్తవాలను మాత్రమే చెబుతున్నానని, పొరపాట్లను సరిదిద్దుకుంటే ప్రపంచకప్ గెలిచే అవకాశాలను కొట్టి పారేయలేమన్నాడు. సొంత గడ్డపై వరల్డ్‌కప్ జరుగుతుండడంతో భారత జట్టుపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయన్నాడు. ఇలాంటి స్థితిలో కెప్టెన్‌తో పాటు ఇతర ఆటగాళ్లపై ఒత్తిడి నెలకొనడడం సహాజమేనని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అసాధారణ ఆటను కనబరచాల్సిన ఉంటుందన్నాడు. పొరపాట్లకు తావులేకుండా ముందుకు సాగితేనే సానుకూల ఫలితాలు వస్తాయన్నాడు. ధోనీలాంటి కెప్టెన్ ఉండి ఉంటే మాత్రం భారత్‌కే ఈ వరల్డ్‌కప్‌లో మెరుగైన అవకాశాలు ఉండేవని షోయబ్ స్పష్టం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News