Monday, December 23, 2024

ODI WorldCup: 156 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్..

- Advertisement -
- Advertisement -

సిమ్లా: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ జట్టుకు 157 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన అఫ్గాన్ జట్టు 37.2 ఓవర్లలో కేవలం  156 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బజ్(22), ఇబ్రహీం జార్డన్(47)లు శుభారంభం అందించినా.. రెహ్మత్ షా(18), అష్మతుల్లా(18), అజ్మతుల్లా(22)లతో పాటు మిగతావారు ఘోరంగా విఫలం కావడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు కనీసం 200 పరుగుల మార్క్ కూడా చేరుకోలేకపోయింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్, మెహిడి హసన్ మిరాజ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. షారిఫుల్ ఇస్లాం రెండు వికెట్లు, తష్కిన్ అహ్మద్, ముస్తఫిజూర్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News