Sunday, January 19, 2025

ODI World Cup: వార్నర్, స్మిత్ ఔట్.. ఒత్తిడిలో ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

చెన్నై: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా చెన్నై వేదికగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా మూడు కీలక వికెట్లు కోల్పో్యింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(41), స్టీవ్ స్మిత్(47)లు హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు.

ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్(0)ను బుమ్రా ఔట్ చేయగా, డేవిడ్ వార్నర్ ను కుల్దీప్ యాదవ్ రిటర్స్ క్యాచ్ తో వెనక్కి పంపాడు. మరో ఎండ్ లో పాతుకుపోయిన స్మిత్ ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 110 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్ 28 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్‌(23), మాక్స్ వెల్(01)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News