హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో టీమిండియా ఓడిపోయిందని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ తెలిపాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పిచ్‌ను వరసగా మూడు రోజులు రోహిత్, రాహుల్ ద్రవిడ్ పరిశీలించారు. ఆస్ట్రేలియాలో జట్టులో కమిన్స్, స్టార్క్ వంటి స్టార్ బౌలర్లు ఉండడంతో స్లో పిచ్‌ను తయారు చేయాలని క్యూరేటర్‌కు సూచించారు. ఇదే ఫైనల్లో ఒటమికి కారణమైందన్నారు. మిగిలిన ఆటగాళ్లకు ఎటువంటి సంబంధం లేదన్నారు. క్యూరేటర్లు పిచ్‌ను తయారు చేస్తారనుకుంటారు కానీ అది నిజం కాదన్నారు. ఫైనల్‌కు ముందు మూడు రోజులు తాను అహ్మదాబాద్‌లోనే ఉన్నానని కైఫ్ పేర్కొన్నాడు. టాస్ గెలిచి ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు 240 పరుగులు చేసింది. ఛేదనలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో ట్రావిస్ హెడ్ 137 పరుగులు చేసి ఆసీస్‌ను గెలిపించాడు. ఆసీస్ ఆరు వికెట్లతో తేడాతో విజయం సాధించి వన్డే కప్‌ను ముద్ధాడింది.
ఆ ఇద్దరితోనే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ ఓడిపోయింది: కైఫ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -