Thursday, December 26, 2024

ఒడియా నటుడు మిహిర్‌దాస్ మృతి

- Advertisement -
- Advertisement -

Odia actor mihir passed away

భువనేశ్వర్: ఒడియా నటుడు మిహిర్‌దాస్(63) మృతి చెందారని ఆయన కుటుంబసభ్యులు మంగళవారం వెల్లడించారు. కటక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దాస్ తుదిశ్వాస విడిచారని వారు తెలిపారు. కొన్నేళ్లుగా దాస్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. గతేడాది డిసెంబర్ 9న దాస్‌ను ఆస్పత్రిలో చేర్చి వెంటిలేషన్‌పై ఉంచారు. దాస్ మయూర్‌భంజ్ జిల్లాలో 1959 ఫిబ్రవరి 11న జన్మించారు. కళాత్మక చిత్రం ‘స్కూల్ మాస్టర్’తో దాస్ సినీ జీవితం ప్రారంభమైంది. లక్ష్మీ ప్రతిమ(1998), ఫేరియా మో సునాభౌనీ (2005) చిత్రాల్లో నటనకు దాస్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. దాస్ కుటుంబసభ్యులకు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్, గవర్నర్ గణేశీలాల్, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News