Wednesday, January 22, 2025

పెళ్లి చేసుకోవడంలేదని.. అంగన్‌వాడీ టీచర్ ను నరికి చంపిన ప్రేమోన్మాది..

- Advertisement -
- Advertisement -

తనను పెళ్లి చేసుకోవడంలేదని ఓ ప్రేమోన్మాది.. అంగన్‌వాడీ టీచర్ ను దారుణంగా నరికి చంపాడు. ఈ విషాద సంఘటన ఓడిసాలోని సుందర్‌ఘర్ జిల్లా హేమగిరి పోలీసు పరిధిలోని జులుంబహల్ పురానా గ్రామంలో జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం.. దివ్యభారతి అనే అంగన్‌వాడీ టీచర్ ను శరత్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో చాలా కాలంగా వెంబడిస్తున్నాడు. అంతేకాదు పలుమార్లు తనని పెళ్లి చేసుకోమని వేధించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అతడి తీరును మార్చుకోమని కూడా దివ్య హెచ్చరించింది.

అయినా.. మొండిగా ప్రవర్తిస్తూ ఆమె వెంటపడుతూనే ఉన్నాడు. అతడి ప్రపోజల్ ను దివ్య తిరస్కరిస్తూనే వచ్చింది. ఎంతకీ తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోవడం లేదని రెచ్చిపోయిన శరత్.. ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో మాటు వేసిన శరత్.. పదునైన కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దివ్య అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు శరత్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హేమగిరి పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News