Saturday, December 21, 2024

గిరిజన మహిళపై దాడి… నోట్లోకి మలం కుక్కి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: గిరిజన మహిళను కులం పేరుతో దూషించడంతో పాటు ఆమెపై దాడి చేసి అనంతరం ఆమె నోట్లో బలవంతంగా మలం కుక్కిన సంఘటన ఒడిశా రాష్ట్రం బలంగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జురబంధా గ్రామంలో అభయ్ సింగ్ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో గిరిజన మహిళకు చెందిన పంటను నాశనం చేస్తుండగా అడ్డుకుంది. అభయ్ ఆమెను కులం పేరుతో దూషించాడు. అనంతరం సదరు మహిళపై దాడి చేస్తుండగా ఆమె అత్త అతడిని అడ్డుకుంది. మరింత రెచ్చిపోయిన మలం తీసుకొని గిరిజన మహిళ ముఖంపై అభయ్ సింగ్ పూసి బలవంతంగా నోట్లోకి కుక్కాడు. సదరు మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎస్సీ, ఎస్ టి యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీస్ అధికారు గౌరంగ్ చరణ్ సాహూ తెలిపాడు. ఈ ఘటనపై గిరిజన సంఘాలు మండిపడ్డాయి. బాధితురాలుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News