Friday, December 20, 2024

గంగసాగర్‌లో చెట్టుకు ఉరేసుకున్న విద్యార్థిని?

- Advertisement -
- Advertisement -

విద్యార్థిని చెట్టు ఉరేసుకొని అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒడిశా రాష్ట్రం బొలంగిర్ ప్రాంతంలో జరిగింది. సదరు విదార్థిని మూడు రోజుల క్రితం అదృశ్యమైనట్టుగా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డంబర్‌బహాల్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి పట్నాగఢ్ జవహర్‌లాల్ కాలేజీలో ప్లస్3(డిగ్రీ) చదువుతోంది. రెండు సంవత్సరాల నుంచి పట్నాగఢ్ ప్రాంతంలో రూమ్ రెంటుకు తీసుకొని కాలేజీకి వెళ్తోంది. గంగసాగర్ గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఆమె మృతదేహం వేలాడుతుండడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో స్కూటీ, హ్యాండ్ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని తండ్రి జ్యోతిష్ దండేసేనా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామ శివారులోకి వచ్చి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హత్య చేసి గ్రామ శివారులో ఉరి వేసి ఉంటారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. శవ పరీక్ష రిపోర్టు వస్తే అసలు విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News