Monday, December 23, 2024

నగ్నంగా వీడియో కాల్ చేసింది…. వ్యాపారవేత్త ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: యువతి, వ్యాపారవేత్త నగ్నంగా వీడియో కాల్ చేసుకున్నారు. వీడియోల్ కాల్‌తో ఆమె బ్లాక్ మెయిల్ చేయడంతో వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వ్యాపారికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయం కావడంతో ఇద్దరు వాట్సాప్‌లో చాటింగ్ చేసుకున్నారు. యువతి కోరక మేరకు సదరు వ్యాపారి వాట్సాప్‌లో వీడియో కాల్ చేశాడు. తాను నగ్నంగా ఉన్నానని, నువ్వు కూడా నగ్నంగా ఉండాలని యువతి వ్యాపారికి సూచించాడంతో అలానే చేశాడు.

Also Read: క్యాప్ పెట్టుకున్నందుకు కండక్టర్‌కు క్లాసు తీసుకున్న మహిళ(వైరల్ వీడియో)

కొంచెం సేపు తరువాత కాల్ కట్ చేసింది. ఇద్దరు మధ్య వీడియో సంభాషణలు, వీడియోలను రికార్డు చేసి అతడికి పంపించి బ్లాక్‌మెయిల్ చేసింది. డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని చెప్పడంతో బెదిరిపోయాడు. వెంటనే వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హేళన చేయడంతో ఆయన దుకాణం వద్దకు వచ్చి కత్తెరతో పొట్టలో పొడుసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాధితుడు భువనేశ్వర్ లోని నయాపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News