Friday, December 20, 2024

భర్తపై దాడి చేసి భార్యపై ఐదుగురు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: భర్తపై దాడి చేసి అనంతరం భార్య ఐదుగురు దుండగులు సామూహికంగా అత్యాచారం చేసిన సంఘటన ఒడిశాలోని డెంకానాల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జాజ్‌పూర జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను బారునా ప్రాంతంలో చదువిస్తున్నాడు. ఆమెకు సెలవులు రావడంతో ఇంటికి బైక్‌పై తీసుకెళ్తుండగా ఐదుగురు దుండగులు బైక్‌ను బలవంతంగా ఆపారు. భర్తపై దాడి చేసి మొబైల్, బైక్ తాళాలు లాక్కున్నారు.

అతడిపై అత్యంత పాశవికంగా దాడి చేసి అనంతరం ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై ఐదుగురు సామూహికంగా అత్యాచారం చేశారు. దీంతో బాధితురాలి తన తీవ్రంగా గాయపడిన తన భర్తతో కలిసి భూబన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తు అత్యాచారం జరిగినట్టు తేలడంతో బాధితురాలును ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News