- Advertisement -
బాలసోర్ : రైళ్ల ఘోర ప్రమాదం నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో శనివారం సంతాపదినం ప్రకటించారు ఈ ప్రమాదంలో 283 మంది చనిపోగా, 900 మంది గాయపడిన విషాద సంఘటన తెలిసిందే. వీరికి సంతాప సూచకంగా రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు, వేడుకలు జరపకూడదని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశించారని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ , చీఫ్ సెక్రటరీ పికె జెనా వెల్లడించారు.
బాధితులకు స్వచ్ఛందంగా కొందరు ముందుకు వచ్చి రక్తదానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బాలసోర్‌లో శుక్రవారం రాత్రికి రాత్రే గాయపడిన వారికోసం 500 యూనిట్ల రక్తం సేకరించి, 900 యూనిట్ల వరకు నిల్వ చేయడమైందని చెప్పారు. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స చేస్తున్నట్టు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రత సాహూ చెప్పారు.
- Advertisement -