త్రిపుర: త్రిపుర పోలీసులు తమను వేధించారంటూ ఆరోపించినందుకు జైలుపాలైన ఇద్దరు మహిళా జర్నలిస్టులకు త్రిపురలోని గోమతి జిల్లాలోని ప్రధాన జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. త్రిపురలో ఇటీవల సంభవించిన హింసాత్మక సంఘటనలపై వార్తా కథనాలను రాసిన మహిళా జర్నలిస్టులు పమృద్ధి సకునియా, స్వర్ణ ఝాలను మత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలను ఆదివారం అస్సాంలో త్రిపుర పోలీసులు అరెస్టు చేశారు. కాగా..ఈ అరెస్టులను తీవ్రంగా ఖండించిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వారిద్దరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. హెడబ్లు న్యూస్ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న సమృద్ధి, స్వర్ణలు త్రిపురలోని మసీదులో జరిగిన విధ్వంసకాండను రిపోర్టింగ్ చేసినందుకు వారిపై త్రిపుర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అస్సాంలోని కరీంగంజ్‌లో వారిద్దరినీ అరెస్టు చేసి ట్రాన్సిట్ రిమాండ్‌పై వారిని త్రిపురకు తీసుకువచ్చారు.
త్రిపురలో ఇద్దరు మహిళా జర్నలిస్టులకు బెయిల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -