Monday, December 23, 2024

ప్రేమజంటను చంపేసి… చెట్టుకు వేలాడదీశారు… ముగ్గురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ప్రేమ జంటను గొంతు నులిమి చంపేసి అనంతరం వారు ఆత్మహత్య చేసుకున్నట్లు చెట్టు ఉరేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం కళహండిలోని ధర్మగఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జూన్ 30 మైనర్ బాలిక-బాలుడు ప్రేమించుకొని పారిపోయారు. బాలిక కుటుంబ సభ్యులు ఆమె కోస వెతకడం ప్రారంభించారు. ధర్మగఢ్‌లోని మిల్ ప్రాంతంలో ఉంటునట్టు బాలిక కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. బాలిక తండ్రి, మామ, సోదరుడు మిల్‌కు చేరుకొని వారిని పట్టుకొని ఇద్దరిని గొంతునులిమి హత్య చేశారు. అనంతరం వాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించేందుకు చెట్టుకు ఉరేశారు. మిల్ గ్రామ శివారులో మృతదేహాలు చెట్టుకు వేలాడుతండడంతో ఆత్మహత్య చేసుకున్నారని అందరూ భావించారు. కానీ శవ పరీక్షలో హత్య చేసినట్టు తేలడంతో బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు: బొత్స

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News