Monday, December 23, 2024

బాలిక మృతదేహాన్ని బ్యాగ్‌లో ప్యాక్ చేసి నదిలో పడేశారు….

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: దయా నదిలో సమీపంలో ఓ బ్యాగ్‌లో బాలిక మృతదేహం కనిపించిన సంఘటన ఒడిశా రాష్ట్రంలోని కనాస్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గడిసగడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయా నదిలో బ్యాగ్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. కాళ్లు, చేతులు తాడుతో కట్టేసి ఉన్నట్టుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశాలోని పలు జిల్లాలో మిస్సింగ్ కేసుల వివరాలను తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు రెడ్ ప్లాగ్ కేసు కింద పరగణిస్తున్నామని పోలీస్ శాఖ వెల్లడించింది. మృతదేహం ఎవరిదో తెలిస్తే నిందితులను పట్టుకోవడం సులభం అవుతుందని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టమ్ నిర్వహించే ముందు మృతదేహాన్ని వీడియో తీసి బద్రపరిచారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News