Friday, December 20, 2024

మంత్రాల నేపంతో హత్య

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: మంత్రగాడు అనే నేపంతో ఓ వ్యక్తిని నలుగురు చంపిన సంఘటన ఒడిశా రాష్ట్రం కంధామాల్ జిల్లాలో బాలిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గిరెన్ గాకియా గ్రామంలో బిందు ప్రధాన్, పునా ప్రధాన్, తునియా ప్రధాన్, గుణి ప్రధాన్ అనే యువకులు ఉన్నారు. గిరెన్‌గాకియా గ్రామస్థులు పోధా జత్రా జాతర అనే పండుగను జరుపుకుంటున్నారు. పండుగలో భాగంగా పాల్ ప్రధాన్ అనే వ్యక్తి ఆ నలుగురు యువకులను ఇంటికి పిలిచాడు. ఆ నలుగురు కలిసి పాల్‌ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.

Also Read: ‘ద కేరళ స్టోరీ’ నిర్మాతలు వాస్తవిక బాధితురాళ్ల వీడియో షేర్ చేశారు!

అనంతరం పాల్‌ను నలుగురు రాయితో కొట్టడంతో ఘటనా స్థలంలోనే చనిపోయారు. రెండు రోజుల తరువాత మృతదేహం కనిపించడంతో పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేస నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నలుగురు యువకులను తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. మంత్రాలు చేసున్నాడనే నేపంతో తాము హత్య చేశామని యువకులు ఒప్పుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News