Friday, December 20, 2024

తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్‌ను సందర్శించిన ఒడిషా మంత్రి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : అధికారిక పర్యటనలో భాగంగా ఒడిషా మంత్రి అటాను సభ్యసాచి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసి, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్(టిఎస్‌సిఎబి)ను సందర్శించారు. ఒడిషా ఫుడ్ సప్లై అండ్ కన్జూమర్ వెల్పేర్, కోఆపరేషన్ మంత్రి సభ్యసాచి తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్(టిఎస్‌సిఎబి) అవలంభిస్తున్న ఉత్తమ పద్ధతులను, సహకార వ్యవస్థలో మానవ వనరుల విభాగంలో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులను అడిగి తెలుసుకున్నారు.

బ్యాంకులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్(సిఎస్‌ఒసి)ను సందర్శించారు. దేశంలోని 34 రాష్ట్ర సహకార బ్యాంకుల్లో ఉత్తమ సేవలను అందించే విభాగంలో ఎన్‌ఎఎఫ్‌ఎస్‌సిఒబి వారు ఇచ్చే అవార్డులను వరుసగా మొదటి, రెండో స్థానాల్లో సొంతం చేసుకున్నందుకు మంత్రి ప్రశంసించారు. ఈ సమావేశంలో టిఎస్‌సిఎబి ప్రెసిడెంట్ కొండూరు రవీందర్ రావు, టిఎస్‌సిఎబి ఎండి డా.నేతి మురళీధర్, సిజిఎం జ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News