Monday, December 23, 2024

ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా

- Advertisement -
- Advertisement -

Naveen Patnaik

భువనేశ్వర్: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా చేసింది. సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆదేశాలతో మంత్రులంతా రాజీనామా లేఖలు సమర్పించారు. స్పీకర్‌ సూర్యనారాయణ పాత్రో కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఒడిశాలోని నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వానికి ఇటీవలే మూడేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మంత్రులంతా రాజీనామా చేయాలని ఆదేశించారు. దాంతో నవీన్ పట్నాయక్ మంత్రిమండలి(మొత్తం 20 మంత్రులు) రాజీనామా చేసింది.

రేపు(ఆదివారం) ఉదయం 11.45 గంటలకు  రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణా స్వీకారం జరగనుందని సంబంధింత వర్గాలు వెల్లడించాయి. ఇలా జరగడం ఒడిశాలో ఇదే మొదటిసారి.  ఒడిశా 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News