Sunday, December 22, 2024

ఆస్తి కోసం తల్లి, అక్కను చంపి… తగలబెట్టాడు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఆస్తి కోసం సోదరుడు తన తల్లి, అక్కను చంపి అనంతరం తన కుమారుడితో కలిసి వారి మృతదేహాలను ఇంట్లోనే తగలబెట్టిన సంఘటన ఒడిశాలో జరిగింది. తండ్రి, కుమారుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. స్నేహలత(90) అనే వృద్ధురాలు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. ముగ్గురు కూతళ్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపింది. స్నేహలత తన కూతురు సౌరెంద్రీ దీక్షిత్ కలిసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండగా కుమారుడు జగన్నాథ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో తన భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. సౌరెంద్రీకి పెళ్లి కాకపోవడంతో టీచర్ జాబ్ చేస్తూ తన తల్లితో కలిసి ఉంటుంది.

ఆస్తి పంపకాల విషయంలో జగన్నాథ్ తన తల్లితో పలుమార్లు గొడవకు దిగాడు. మంగళవారం రాత్రి తల్లీ కూతుళ్లు మంటల్లో కాలిపోయి చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మంటలు చెలరేగడంతో ఊపిరాడక చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శవ పరీక్షలో గొంతు నులిమి చంపినట్టు తేలడంతో వెంటనే కుమారుడు జగన్నాథ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తన తల్లి స్నేహలత, సోదరి సౌరెంద్రీ దీక్షిత్‌ను గొంతు నులిమి చంపిన అనంతరం తన కుమారుడు సంకేత్ దీక్షిత్ సహాయం మృతదేహాలను తగలబెట్టామని జగన్నాథ్ నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News