Sunday, December 22, 2024

విదేశీ మహిళతో అసభ్య ప్రవర్తన…. పూజారికి జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: దేవాలయానికి వచ్చిన విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో పూజారికి 18 నెలల జైలు శిక్ష సంఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  భువనేశ్వర్ లో 11వ శతాబ్ధానికి చెందిన లింగరాజ్ దేవాయంలో కుందన్ మహాపత్రా అనే వ్యక్తి పూజారిగా పని చేస్తున్నారు. ఫ్రిబవరి 19న స్వీడన్ దేశానికి చెందిన ఓ యాత్రికురాలు ఆ దేవాలయానికి వచ్చారు. దేవాలయంలో విదేశీ మహిళ ఒంటరిగా కనపడడంతో ఆమెతో పూజారి అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అదే రోజున అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం 19న సదరు పూజారికి కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News