Tuesday, December 24, 2024

ఆర్థిక సమస్యలు… తల్లి గొంతు నులిమి చంపిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: కుమారుడు కన్న తల్లి గొంతు నులిమి హత్య చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం బర్గాఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పిపిలిపాలి గ్రామంలో కార్తీక్ భూ అనే వ్యక్తి నివసిస్తున్నారు. కార్తీక్ తల్లి మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తన తల్లికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కార్తీక్ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన తల్లి గొంతు నులిమి హత్య చేశాడు. కార్తీక్ సోదరుడు సుశాంత్ భూ గ్రామం శివారులో నివసిస్తున్నాడు. తల్లి చనిపోయిందని విషయం తెలుసుకొని ఇంటికి వచ్చాడు. వెంటనే సర్పంచ్ జుగేశ్వర్ సాహూ, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన తల్లి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఖర్చులు పెరిగిపోయాయి. అంతే కాకుండా కార్తీక్ ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడంతో తన తల్లిని చంపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కార్తీక్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News