Wednesday, January 22, 2025

మృతులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా

- Advertisement -
- Advertisement -

ఒడిశాలో రైళ్ల ప్రమాదంలో మృతి చెందిన తమిళనాడుకు చెందినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష వంతున ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, రూ. 10 లక్షలు కేంద్రం, రైల్వేలు ఇంతకు ముందే ప్రకటించగా, అదనంగా తమిళనాడు ప్రభుత్వం సహాయం ప్రకటించింది. తమిళనాడులో ప్రమాద బాధితుల వివరాలు తెలుసుకోడానికి సహాయంగా హెల్‌లైన్ నెంబర్లు 9445869848, టోల్‌ఫ్రీ నెం. 1070. వాట్సాప్ నెం. 9445869848 ప్రకటించారు.

అధికారిక కార్యక్రమాలు రద్దు
తమిళనాడులో అధికారిక కార్యక్రమాలన్నిటినీ రద్దు చేశారు. శనివారం జరగాల్సిన మాజీ సిఎం, ద్రవిడియన్ దిగ్గజం ఎం. కరుణానిధి శతజయంతి ఉత్సవాలను కూడా రద్దు చేశారు. మృతులకు సంతాప సూచకంగా ముఖ్యమంత్రి స్టాలిన్, అధికారులు ఒక నిమిషం మౌనం పాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News