Monday, December 23, 2024

రైలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మరోవైపు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించింది. రైలు ప్రమాదంలో మరణించిన ఒడిశా పౌరుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News