Monday, January 20, 2025

ఒడిశా రైలు ప్రమాదం..19 మంది బీహార్ ప్రయాణికులు గల్లంతు

- Advertisement -
- Advertisement -

పాట్నా : ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగినప్పుడు కోరమాండల్‌లో ఉన్న ప్రయాణికుల్లో బీహార్ ప్రయాణికులు 19 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కావడం లేదని మరో 50 మంది మృతి చెందారని బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. గల్లంతైన వారిలో మధుబని జిల్లాకు చెందిన వారు నలుగురు ఉండగా, మిగతా జిల్లాల వారీగా దర్బాంగా ఇద్దరు,ముజఫర్‌పూర్ ఇద్దరు, తూర్పు చంపారన్ ఇద్దరు సమస్తిపూర్ ఇద్దరు, సీతామర్హి ఇద్దరు పాట్నా ఒకరు, గయ ఒకరు, షేక్‌పుర ఒకరు, సివాన్ ఒకరు. బెగుసరాయి ఒకరు, ఉన్నారు. అలాగే వివిధ జిల్లాలకు చెందిన మరో 50 మంది మృత్యువాత పడ్డారు.

ముజఫర్ జిల్లాకు చెందిన వారు తొమ్మిది మంది, మధుబని జిల్లా ఆరుగురు, భాగల్పూర్ ఏడుగురు, తూర్పు చంపారన్ ఐదుగురు, పూర్ణియా ఇద్దరు, పశ్చిమ చంపారన్ ముగ్గురు, నవడా ఇద్దరు, దర్బాంగా ఇద్దరు, జముయి ఇద్దరు, సమస్తిపూర్ ముగ్గురు, బంకా ఒకరు, బెగుసరాయి ఒకరు, గయ ఒకరు, ఖగారియా ముగ్గురు, షార్షా ఒకరు, సీతామర్హి ఒకరు, ముంగేరు ఒకరు మృతుల్లో ఉన్నారు. మృతదేహాలను గుర్తించడంలో ఒడిశా ప్రభుత్వానికి బీహార్ విపత్తు నిర్వహణ విభాగం సహకారం అందిస్తోంది.

12 మంది బీహార్ ప్రయాణికుల డిఎన్‌ఎ శాంపిల్స్ బుధవారం సేకరించి పరీక్షించగా, అవి గుర్తింపుకాని మృతదేహాలతో సరిపోలాయి. కనీసం బీహార్‌కు చెందిన 19 మంది ప్రయాణికులైనా కోరమాండల్ లో ఉండి ఉంటారని కానీ వీరు గల్లంతయ్యారని చెబుతున్నారు. బాలసోర్‌లో చిక్కుకున్న బీహార్ ప్రయాణికులు 88 మందిని బస్సు ద్వారా ఇంతవరకు స్వస్థలాలకు చేర్చగలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News