Monday, January 27, 2025

పక్కింటి పైకి రూ. రెండు కోట్ల పెట్టెలు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఇరుగుపొరుగు అన్నాక ఈ మేరకైనా సాయం చేసుకోరాదా… అనుకున్నాడేమో ఒడిషాలో ఓ అధికారి తన నివాసం నుంచి పక్కింటి డాబాపైకి రెండు కోట్ల రూపాయల పెట్టెలు రెండింటిని విసిరేశారు. నబ్‌రంగ్‌పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టరు ప్రశాంత్‌కుమార్ రౌత్ జీత భత్యాలకు మించి లెక్కకు మించిన ఆదాయంతో ఆస్తులతో ఉన్నారని విజిలెన్స్ అధికారులు పసికట్టారు. ఏదో ఒక్కటి చేయాలని అనుకున్నారు. అయితే దీనిని గుర్తించి విజిలెన్స్ శాఖ వారు అధికారికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా శుక్రవారం తెల్లవారు దీనితో ఈ అధికారి ఇంటిపై సోదాలకు దిగి, ట్రాప్ చేయాలని సంకల్పించారు. ఓ వైపు కింది అంతస్తుల్లో గాలింపులు పట్టివేతలు జరుగుతూ ఉండగానే పైన ఉన్న అధికారి రెండు పెట్టెలను తీసుకుని పక్కింటిపైకి విసిరేశాడు.

అయితే దీనిని కూడా గుర్తించిన అధికారులు వెంటనే పక్కింటి టెర్రస్‌పై ఉన్న రెండు పెట్టెలను పట్టుకున్నారు. ఈ అధికారి ఇటీవలే రెండువేల రూపాయల నోట్లను మార్పించి రూ 500 నోట్లుగా తెప్పించి ఇంట్లో బాక్సులలో పెట్టుకున్నారని , ఇది రూ 2.25 కోట్లు అని , దీనిని సీజ్ చేశామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇక పక్కింటి టెర్రస్‌పై దొరికిన నగదు రూ 2000 కోట్లు అని వివరించారు. ఇవి కాకుండా ఈ అధికారికి చెందినవిగా భావిస్తున్న తొమ్మిది స్థానాలలో జరిపిన దాడులలో మరో కోటి రూపాయలు పట్టుకున్నారు. జిల్లాలో మైనింగ్ మాఫియాకు సహకరిస్తూ రౌత్ దండిగా డబ్బులు వెనుకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన అవినీతి క్రమం 2018లో కిందిస్థాయి అధికారిగా ఉన్నప్పుడు లంచాలు తిన్న దశలోనే వెలుగులోకి వచ్చింది. అప్పుడు అరెస్టు అయిన రౌత్ అచిర కాలంలోనే వేరే జిల్లాకు అదనపు సబ్ కలెక్టరు హోదాకు చేరాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News