Monday, January 20, 2025

వృద్ధురాలిని తొక్కి చంపినా చల్లారని ఏనుగు కోపం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ (ఒడిశా): ఒడిశా బరిపడాలోని రాయ్‌పల్ గ్రామంలో ఒంటరిగా ఉంటున్న 70 ఏళ్ల మయ ముర్కూ గురువారం నీటికోసం పంపు మోటార్ దగ్గరకు రాగా, ఓ ఏనుగు వచ్చి దాడి చేసింది. ఈ ఏనుగు దాల్మా వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి తప్పించుకుని పొలాల్లోకి దూసుకొచ్చింది. తీవ్ర గాయాలతో మయ ముర్కూ చనిపోగా, సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే అదే సమయంలో మళ్లీ ఆ ఏనుగు అక్కడికి వచ్చి చితిపై ఉన్న ముర్కూ మృతదేహాన్ని తొండంతో మీదికెత్తి పడేసి తొక్కింది. ఆపై గిరగిరా తిప్పేసి దూరంగా విసిరేసి వెళ్లి పోయింది. ఈ ఘటనకు అక్కడి వారంతా భయపడ్డారు. కాసేపటికి అంత్యక్రియలు పూర్తి చేశారు. మయ ముర్కూ భర్త ఏడేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయాడు. భార్యే విషం పెట్టి చంపిందనే పుకారు ప్రచారంలో ఉంది. ఆ భర్తే ఆత్మగా మారి ఏనుగు ద్వారా వచ్చి చంపి ప్రతీకారం తీర్చుకుని ఉంటాడని గ్రామస్థులు అనుకుంటున్నారు.

Odisha Woman dies after Elephant hit

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News