Wednesday, January 22, 2025

హిజ్రాతో భర్తకు పెళ్లి చేసిన భార్య (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

Woman gets husband married off to transgender

భువనేశ్వర్: హిజ్రాను భర్త ప్రేమించడంతో థర్డ్ జెండర్‌తో అతడికి భార్య వివాహం జరిపించిన సంఘటన ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డోర్ కుట్ గ్రామంలో ఫకీర్, నియాల్ అనే దంపతులు ఉన్నారు. దంపతులు సంతోషంగా ఉన్నా సమయంలో భర్త సంవత్సరం నుంచి అదే గ్రామంలో సంగీత అనే హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో వెంటనే హిజ్రాను తన ఇంటికి తీసుకొచ్చి భర్తతో పెళ్లి జరిపించింది. సంగీత మాట్లాడుతూ… పకీర్‌ను గాఢంగా ప్రేమించానని, నియాల్ తనకు కొత్త జీవితం ప్రసాదించిన దేవత అని కొనియాడింది. తనకు ఒక కుటుంబం ఉందని హిజ్రా సంతోషం వ్యక్తం చేసింది. పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News