Friday, December 20, 2024

చెల్లెల్ని రేప్ చేసి, స్నేహితులను ఉసిగొల్పిన కామాంధుడు

- Advertisement -
- Advertisement -

వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు అన్నను చెల్లెలు మందలించింది. అదే ఆమె చేసిన తప్పు. తనను మందలించిందన్న కోపంతో ఊగిపోయిన ఆ కామాంధుడు చెల్లలని కూడా చూడకుండా ఆమెను రేప్ చేశాడు. స్నేహితులను కూడా ఆమెపైకి ఉసిగొల్పాడు. ఆ తర్వాత అందరూ కలసి ఆమె ప్రాణాలు తీశారు. దారుణమైన ఈ సంఘటన ఒడిశాలోని చకపాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

కంధమల్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి వదినతో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయాన్ని అతని చెల్లెలు పసిగట్టింది. తప్పు చేస్తున్నావంటూ అన్నను మందలించింది. ఇకనైనా మారకపోతే అందరికీ ఈ విషయం తెలియజేస్తానని బెదిరించింది. దాంతో ఆ అన్న కోపంతో ఊగిపోయాడు. నవంబర్ 3న చెల్లెలు కట్టెలు ఏరుకురావడానికి అడవికి వెళ్లింది. అది గమనించిన అన్న.. తన స్నేహితులు నలుగురిని పిలిచాడు. వారికి మందు తాగించాడు. ఆ తర్వాత అందరూ కలసి ఆ యువతిని నిర్బంధించి రేప్ చేశారు. అంతటితో ఆగకుండా, మెడకు తాడు బిగించి, గొడ్డలితో నరికి చంపేశారు.

ఆ తర్వాత హతురాలి అన్న ఏమీ తెలియనట్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన చెల్లెలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులకు నాలుగు రోజుల తర్వాత అడవిలో కుళ్లిపోయిన యువతి మృతదేహం కనిపించింది. నిందితులకోసం గాలింపు ప్రారంభించారు. అప్పటికే వారు పరారీలో ఉన్నారు. చివరకు వారి ఆచూకీని కనుగొని శనివారం అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News