- Advertisement -
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నేరాలు ఘోరాలకు అడ్డగా మారింది. రోజు రోజుకు యుపిలో క్రైమ్ రేటు పెరుగుతోంది. హత్రాస్ ఘటనలో బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపిన 24 గంటలు కాకముందే యుపిలోని అలీగఢ్ ప్రాంతంలో మరో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా గోళ్లతో రక్కి చంపేశారు. అర్ధ నగ్నంగా ఉన్న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిసున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -