Tuesday, March 4, 2025

ఇదేం బౌలింగ్ రా బాబూ! (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

షేన్ వార్న్, అనిల్ కుంబ్లే, ముత్తయ్య మురళీధరన్ వంటి స్పిన్నర్ల బౌలింగ్ లో ఆడాలంటే బ్యాట్స్ మెన్ భయపడేవారు. వాళ్లు బౌలింగ్ చేస్తే బంతి ఎటువైపునుంచి వికెట్ల మీదకు దూసుకొస్తుందో చెప్పడం కష్టం. తాజాగా ఇలాంటి బౌలింగ్ కు సంబంధించిన వీడియో ఒకటి నెట్లో తెగ వైరల్ అవుతోంది. బౌలర్ ఎవరో తెలియదు గానీ, అతను బాగా ఎత్తుగా విసిరిన బంతి నేలను తాకి, సూటిగా వికెట్ల మీదకు దూసుకుపోయింది. బ్యాటర్ తోపాటు ఇతర ఆటగాళ్లు కూడా అలా విస్తుపోయి చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియో ఒక లోకల్ మ్యాచ్ కు సంబంధించినదని తెలుస్తోంది.

దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంసీకి ఈ వీడియో ఎంతో బాగా నచ్చింది. ఇలాంటి బంతులు వేసేందుకు ప్రయత్నించమని తన సహ బౌలర్ కేశవ్ మహరాజ్ కు సలహా ఇస్తూ షంసీ ఈ వీడియోను రీ ట్వీట్ చేశాడు.

నెట్ లో వీడియోను తిలకించిన అనేకమంది దీనిపై సరదా సరదా కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ ఈ బంతిని ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా అభివర్ణించాడు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News