Monday, January 20, 2025

మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ ః బోనాల మహోత్సవం పురస్కరించుకుని ముషీరాబాద్ మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ శుక్రవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పోతురాజుల ప్రదర్శనతో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎయిర్‌టెల్ రాజు, ఈవో జ్యోతి, ఆలయ ప్రధాన అర్చకులు వై. చంద్రమౌళి, ధర్మకర్త గోరఖ్‌నాథ్, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహ, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శివ ముదిరాజ్, దీన్ దయాళ్ రెడ్డి, వంగాల నర్సింగ్ రావు, రాకేష్ కుమార్‌లు పాల్గొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర ప్రజలను వరదల నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి మహంకాళి అమ్మవారే కాపాడారని గుర్తు చేశారు. ఈ చరిత్రను ఆధారంగా చేసుకుని నగర ప్రజలు ప్రతి ఏడాది ఆనవాయితీగా బోనాలు సమర్పించడం జరుగుతోందని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని అమ్మవారు మరింత పెంచుకుంటున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News