Monday, December 23, 2024

30 ఆలయాలకు పట్టువస్త్రాల సమర్పణ

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: చారిత్రక పాతబస్తీ హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం 75వ (వజ్రోత్సవాలు) వార్షిక బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని 30 అమ్మవారి దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధ్యక్షులు రామ్‌దేవ్ అగర్వాల్ తెలిపారు. సోమవారం ఆలయ ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సలహాదారులు జి.రాజరత్నం, డాక్టర్ ఆవుల భరత్ ప్రకాష్, కోశాధికారి ఎ. సతీష్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.పి.క్రాంతి కుమార్లతో కలిసి ఆషాఢ బోనాల ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ఈనెల 22న గోల్కొండ శ్రీ జగదాంబిక, 23న బల్కంపేట ఎల్లమ్మ, 24న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, 25న జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బషీర్‌బాగ్ కనకదుర్గకు, ఆ తరువాత ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీలోని 25 ప్రధాన ఆలయాలకు పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించనున్నట్లు వివరించారు.

వజ్రోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 నుండి జూలై 19వ తేదీ వరకు అన్నప్రసాద వితరణ 75 రోజులు కొనసాగుతుందన్నారు. నగరంలో ఎక్కడ, ఏ ఆలయంలో చేపట్టిన విధంగా తొలిసారి ప్రతిరోజు వేయి మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా 75వ వార్షిక బోనాల ఉత్సవాలను జులై ఏడు నుండి 18వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం మాతృమూర్తులచే సామూహిక కుంకుమార్చన పూజ ఈనెల 23న, 30న, జులై 7, 14, శ్రావణ మాసంలో 21న ఐదు శు క్రవారాలు జరుగుతుందన్నారు.

జులై ఏడు శుక్రవారం ఉత్సవాలు మహాభిషేకం, కలశస్థాపన, ధ్వజారోహణంతో ప్రారంభమై, 9వ తేదీ ఆదివారం శాలిబండ శ్రీ కాశీవిశ్వనాథ దేవాలయం నుండి ఘట ప్రతిష్ఠాపన ఊరేగింపు, జూలై 12 బుధవారం ఉదయం అమ్మవారికి శాఖాంబరి పూజ, సాయంత్రం 5గంటలకు 74 ఏళ్ళ బోనాల ఫోటో ప్రదర్శన, సాయంత్రం ఏడు గంటలకు దీపోత్సవం, 16వ తేదీ ఆదివారం ఉదయం అమ్మవారికి మహాభిషేకం, బో నాల సమర్పణ, రాత్రికి శాంతి కల్యాణం, 17న ఉదయం 11 గంటలకు పోతరాజు స్వా గతం, మధ్యాహ్నం ఒంటి గంటకు భవిష్యవాణి (రంగం), సాయంత్రం నాలుగు గటలకు అంబారీపై మాతేశ్వరి ఘటంతో భవ్య ఊరేగింపు, 18న మంగళవారం అష్ఠాదళ పద్మారాధన, పవిత్రోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని వివరించారు. వజ్రోత్సవాలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ముఖ్యమ ంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల రాజకీయ నేతలను తదితర ప్ర ముఖలను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News