Friday, December 27, 2024

లాల్ దర్వాజ అమ్మవారికి టి టిడిపి పట్టు వస్త్రాలు, బోనం సమర్పణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బోనాల పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పాత బస్తీలోని లాల్ దర్వాజ సింహావాహని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మ వారికి పట్టు వస్త్రాలను పంపించారు. ఈ మేరకు ఆదివారం బోనాల పండుగను పురస్కరించుకుని టి టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ లాల్ దర్వాజ మహంకాళి దేవాలయాన్ని సందర్శించి తన చేతుల మీదగా నారా భువనేశ్వరి పంపించిన పట్టు వస్త్రాలను అమ్మ వారికి సమర్పించారు.

ఆదివారం బోనాల పండుగ సందర్భంగా..లాల్ దర్వాజ మహంకాళి అమ్మ వారికి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి బోనం సమర్పించగా, పట్టు వస్త్రాలు, పూల దండలను కాసాని జ్ఞానేశ్వర్ అమ్మ వారికి సమర్పించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ లాల్ దర్వాజ మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయాలతో పాటు బేలా ముత్యాలమ్మ, కార్వాన్ దర్బార్ మైసమ్మ, పోచమ్మ, సబ్జి మండి గంగపుత్ర కాలనీ మహంకాళి దేవాలయాలను సందర్శించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర, స్థానిక టిడిపి పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి దేవాలయాల్లో పూజలు నిర్వహించి భక్తులకు, ప్రజలకు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. కాగా కార్వాన్ సబ్జి మండి గంగపుత్ర కాలనిలో మహంకాళి అమ్మ వారి దేవాలయంలో గజరాజు ఏనుగు నుండి తొండంతో కాసాని ఆశీర్వాదం పొందారు. కాసాని వెంట ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి వెంకటేష్, రాష్ట్ర టి టిడిపి మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పి సాయి బాబా, రాష్ట్ర అధికార ప్రతినిధి బిల్డర్ ప్రవీణ్, రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శులు పెద్దోజు రవీంద్రా చారి, ప్రకాశ్ ముదిరాజ్, మేకల భిక్షపతి ముదిరాజ్, రవీంద్రా చారి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆవుల భరత్ ప్రకాష్, హైదరాబాద్ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి జోగేందర్ సింగ్, రాష్ట్ర నాయకులు బిగడి అనూప్, సురేందర్ సింగ్, ఫ్యాట నందకిశోర్, కాసాని సాయి, జగదీష్ యాదవ్, మాదాపూర్ రాజు , తదితరులు పాల్గొన్నారు.

Shakeela Reddy Bonam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News