Friday, November 22, 2024

సిబిఐ కేసులో రైలు కిందపడి ఇడి అధికారి ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన అధికారి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీలోని సాహిబాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన అలోక్ కుమార్ రంజన్ గతంలో ఆదాయపు పన్ను విభాగంలో విధులు నిర్వహించేవారు. డిప్యుటేషన్‌పై ప్రస్తుతం అలోక్ ఇడిలో పని చేస్తున్నారు. ఓ అవినీతి కేసులో సిబిఐ అతడిని రెండు సార్లు విచారించింది. ఆయన నేరం చేసినట్టు ఆధారాలు లభించకపోవడంతో అలోక్ సిబిఐ అధికారులు వదిలిపెట్టారు. బుధవారం ఉదయం సాహిబాబాద్‌లో రైలు కిందపడి అలోక్ ఆత్మహత్య చేసుకున్నారు.

స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. సాహిబాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి వివరాలను సేకరిస్తున్నారు. ఇడి అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్‌ను సిబిఐ అరెస్టు చేసిన తర్వాత లంచం కేసులో అలోక్ కుమార్ రంజన్ పేరు తెరపైకి వచ్చింది. రూ. 50 లక్షలు ఇస్తే  తన కుమారుడిని అరెస్టు చేయనని సందీప్ సింగ్ ఓ వ్యక్తికి ఆఫర్ ఇచ్చాడు. సదరు వ్యక్తి సిబిఐకి సమాచారం ఇవ్వడంతో రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ సందీప్ సిబిఐకి చిక్కాడు. దీంతో అలోక్ పేరు తెరపైకి వచ్చినట్టు సమాచారం. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తుందనే అనుమానంతోనే అలోక్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News