Saturday, November 16, 2024

జవహార్ నగర్ డంపింగ్ యార్డను పరిశీలించిన అధికారుల బృందం

- Advertisement -
- Advertisement -

 దుర్వాసన నివారణశాశ్వత పరిష్కారం
మరో 28 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు
తాత్కాలిక నివారణకు డ్రోన్లతో స్పేయింగ్

officers inspected the Jawahar Nagar dumping yard

మన తెలంగాణ /సిటీ బ్యూరో:  జవహర్ నగర్ డంపింగ్ యార్డును నుంచి వెలువడుతున్న దుర్వాసన నివారణపై అధికారులు దృష్టి సారించారు. డంపింగ్ యార్డు నుంచి వస్తున్న దుర్వాసన తొలగించేందుకు డ్రోన్ల సహాయంతో స్ప్రేయింగ్ చేయించడంలో సమస్యను తక్షణమే పరిష్కారించాలని నిర్వహణ సంస్థ అయిన రాంకీని అధికారులు ఆదేశించారు. డంపింగ్ యార్డు నుంచి భరించలేనంత దుర్వాసన వస్తోందంటూ పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావుకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు అందడంతో వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలంటూ అధికారులను అదేశించిన విషయం తెలిసిందే..

దీంతో శనివారం ఉదయం హుటాహుటిన జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, జవహార్ నగర్ మేయర్ మేకల కావ్య, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్‌ఎంసి కమిషననర్ డి.ఎస్.లోకేష్ కుమార్‌ల కూడిన అధికార బృందం పరిశీలించింది. జవహార్ నగర్ డంపింగ్ యార్డు 10 కిలో మీటర్ల మేర చుట్టూ రాత్రి వేళా భరించలేనంత దుర్వాసన వెల్లువడుతోంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత వారం రోజులను దుర్వాసన మరింత పెరుగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. దీంతో డంపింగ్ యార్డును రాంకీ ఎన్విరో సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మసూద్ మల్లిక్‌తో కలిసి పూర్తిస్థాయిలో పరిశీలించిన అధికారులు దుర్వాసన రావడానికి గల కారణాలపై ఆరా తీశారు. డంపింగ్ నిర్వహణకు సంబంధించి సంప్రదాయ శాస్త్రీయ పద్దతుల వినియోగంతో పాటుగా డ్రోన్ల సహాయంతో స్ప్రేయింగ్ నిర్వహించాలని సూచించారు. క్యాపింగ్‌ను పూర్తి చేయడంతో పాటు తక్షణమే వ్యర్థాల మేటలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ డంపింగ్ యార్డు పరిసర ప్రాంత ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. డంపింగ్ యార్డులో చేపట్టిన పనితీరును ఎప్పటీకప్పుడు పరిశీలించి, పర్యవేక్షించేలా అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేస్తామని వెల్లడించారు. సమస్య నివారణ చేపట్టిన చర్యలను 15 రోజుల్లో మరోసారి పరిశీలించనున్నట్లు మేయర్ తెలిపారు. మున్సిపల్ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన రాకుండా అరికట్టేందుకు రూ.700 కోట్ల వ్యయంతో 28 మెగా వాట్ల సామర్థంగల మరో విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News