Sunday, December 22, 2024

అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: ఈ నెల 24 న జిల్లాలో జరగనున్న రాష్ట్రముఖ్యమంత్రి కేసిఅర్ పర్యటనను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. బుధవారం సిఎం కెసిఆర్ పర్యటన నేపథ్యంలో బ హిరంగ సభ నిర్వహించే స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ప రిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా జిల్లాలో సమీకృత కలెక్ట రేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయం, బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు ఇతర అభివృద్ధ్ది పనుల శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్న సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

బహిరంగ సభ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి శ్రీనివాస్, జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ గాదావేణి మల్లేష్, సిఐలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News