Thursday, January 23, 2025

రజనీ జైలర్ ప్రీమియర్ షోల కోసం ప్రైవేట్ ఆఫీసులకు హాలిడే

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కొత్త చిత్రం జైలర్ ఆగస్టు 10వ తేదీనప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్భంగా అభిమానుల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. బుధవారం ప్రీమియర్ షోలు దేశ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. దీంతో రజనీ అభిమానుల కోసం చెన్నై, బెంగళూరులోని అనేక ప్రవేట్ కంపెనీలు బుధవారం తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించడం విశేషం.

జైలర్ చిత్రం ్రప్రివ్యూలపై చాలా పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు అతృతతో ఎదురుచూస్తున్నారు. రజనీ సొంత రాష్ట్రం కర్నాటకలో 90 శాతం స్క్రీన్లు జైలర్‌కు కేటాయించడంతో మొట్టమొదటిసారి రజనీ క్రేజ్ కర్నాటకకూ విస్తరించింది.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాలారోజుల తర్వాత రజనీ నటిస్తున్న యాక్షన్ చిత్రం కావడం, బ్లాక్ కామెడీకి కేరాఫ్‌గా మారిన నెల్సన్ మార్కు కామెడీ ఈ చిత్రానికి ప్లస్ కావడం అభిమానుల్లో జైలర్‌పై అంచనాలు పెంచేసింది. ప్రియాంక మోహన్, శివ రాజ్‌కుమార్, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, యోగి బాబు, వసంత్ రవి, వినాయకన్ తదితర తారాగణంతోపాటు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా ఈ చిత్రంలో నటిస్తుండడం అదనపు ఆకర్షణగా మారింది. బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ కూడా ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. అనిరుధ్ స్వరకల్పనలో ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు పాపులర్ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News