Wednesday, January 22, 2025

బ్రిటన్‌లో టిక్‌టాక్‌పై అధికారిక నిషేధం

- Advertisement -
- Advertisement -

లండన్ : భద్రతా కారణాలతో బ్రిటన్‌లో ప్రభుత్వ పరిధిలోని కమ్యూనికేషన్ వ్యవస్థ , ఫోన్లలో టిక్‌టాక్‌ను నిషేధించారు. చైనాకు చెందిన ఈ సామాజిక మాధ్యమ వీడియో యాప్ వల్ల దేశ కీలక రహస్య సమాచారం లీక్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ఈ చర్య తీసుకున్నట్లు కేబినెట్ మంత్రి ఓలివర్ డౌడెన్ తెలిపారు. ఇప్పటికే టిక్‌టాక్‌ను ఇండియాతో పాటు, అమెరికా, కెనడా, ఇయూలలో నిషేధించారు. ప్రభుత్వ అధికార వర్గాలు వాడే ఫోన్లకు ఈ యాప్ అనుసంధానం అయి ఉంటే కీలక సమాచారం బహిర్గతం అవుతుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిషేధానికి దిగినట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News