Sunday, April 6, 2025

అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలో భారీ వర్షాల దృష్టా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. శుక్రవారం భారీ వర్షాలపై ఆర్డీవోలు, తహసిల్దార్లు, మున్సిపల్ కమీషనర్లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపినందున అధికారులంతా అప్రమత్తతో, అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

జిల్లాకేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ప్రజలు సహాయానికి ఫోన్ నెంబర్ టోల్‌ఫ్రీ నెంబర్ 18004254731కు కాల్ చేయాలని తెలిపారు. జిల్లాలో ఉన్న చెరువులు, రిజర్వాయర్లు, కాల్వల నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

జిల్లాలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పరిస్థితులు మెరుగుపడే వరకు చెరువులు, వాగుల వద్ద చేపలు పట్టడానికి అనుమతించవద్దని అన్నారు. ఈ టెలికాన్పరెన్స్‌లో ఆర్డీవోలు కె మహేశ్వర్, హరిసింగ్, తహసిల్దార్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News