Monday, January 20, 2025

డ్రగ్స్ మాఫియాకు అధికారులు చెక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ సరఫరాకు చేసిన భారీ ప్లాన్ ను పోలీసులు భగ్నం చేశారు. నగర శివారు ప్రాంతాల్లో మాఫియా డ్రగ్స్ ను డంప్ చేసింది. పలు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా గుర్తించి అధికారులు సీజ్ చేశారు. డ్రగ్ మాఫియా శివారులో ఏకంగా డ్రగ్స్ తయారీ ల్యాబ్ లు ఏర్పాటు చేసిందని అధికారులు వెల్లడించారు. ల్యాబ్స్ పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందిందన్నారు.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు డిసెంబర్ 21 నుంచి ఆపరేషన్ మొదలు పెట్టినట్లు తెలిపారు. డ్రగ్ మాఫియా ముఠా పలు పార్టీల నుంచి ఆర్డర్లు తీసుకున్నట్లు వెల్లడించారు. డిఆర్ఐ అధికారులు నిన్న ఏకంగా రూ.50 కోట్ల డ్రగ్స్ ను సీజ్ చేశారు. న్యూ ఇయర్ కు సిద్ధం చేసిన డ్రగ్స్ ను ముఠా తరలిస్తున్నట్లు చెప్పారు. చెంగిచెర్ల, ఉప్పల్ లో రూ. 50 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. చర్లపల్లి, బోడుప్పల్ పరిసర ప్రాంతాల్లో రెండు డ్రగ్స్ ల్యాబులను గుర్తించారు. ఈ కేసులో ఏడుగురుని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News