Monday, January 20, 2025

అధికారులు స్పందించారు ‘పల్లె ప్రకృతి వనాన్ని’ చక్కబెట్టారు

- Advertisement -
- Advertisement -

చర్ల : అధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనాన్ని చక్కబెట్టారు.. ఆదివారం ‘మన తెలంగాణ’ దిన పత్రికలో వెలువడిన ‘లక్షలు వెచ్చించి… నిర్లక్షంగా వదిలేశారు’ అనే కథనంపై కొయ్యూరు పంచాయతీ అధికారులు స్పందించారు. పంచాయతీ కార్యదర్శి పురుషోత్తం, సర్పంచ్ కవిత, సిబ్బందితో కలిసి పల్లె ప్రకృతి వనంలో ప్రత్యేక పారిశుద్ధ పనులు నిర్వహించారు. ఖాళీ మందుబాటిళ్లు, చెత్తాచెదరాన్ని తొలగించారు. వనం చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను సరిచేశారు. పశువులు, మేకలు లోనికి ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.

ప్రకృతి వనంలోని మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పట్టనున్నట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తులు, మందుబాబులు రాకుండా ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. పల్లె ప్రకృతి వనానికి ప్రతిరోజూ సందర్శకులు, పరిసర గ్రామాల ప్రజలు వచ్చే విధంగా మరింత ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించనున్నట్లు తెలిపారు. పల్లె ప్రకృతి వనాన్ని చక్కబెట్టే విధంగా మంచి కథనం అందించిన ‘మన తెలంగాణ’ విలేఖరిని స్థానిక ప్రజలు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News