Wednesday, January 22, 2025

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా

భూపాలపల్లి కలెక్టరేట్: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేయాల్సిన విధులపై సెక్టోరల్ ఆఫీసర్స్, మాస్టర్ ట్రైనర్స్, నోడల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం కలెక్టర్ పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన నియమ, నిబంధనలపై అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండడం చాలా కీలకమని, ముఖ్యమైన నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్‌డిఓ రమాదేవి, నోడల్ ఆఫీసర్స్ తహసీల్దార్లు, సెక్టోరల్ అధికారులు, ఎంపిడిఓలు, మాస్టర్ ట్రైనర్స్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News