Thursday, November 14, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

అసైన్డ్‌మెంట్ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతోంది
హైదరాబాద్, ఢిల్లీలోని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి

మనతెలంగాణ/హైదరాబాద్: నిధులను ఇతర మార్గాలకు మళ్లీస్తున్నారని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్‌మెంట్ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని లావాదేవీలపై నిఘా పెట్టాలని, ఈ విషయమై ఎన్నికల సంఘానికి అధికారులకు ఫిర్యాదు చేస్తామని, ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని, ఇటు హైదరాబాద్‌లో అటు ఢిల్లీలో ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
బినామీ పేర్లపైకి అసైన్డ్ భూములు: భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అనేక సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన భట్టి హైదరాబాద్ పరిసరాల్లోని అసైన్డ్ భూములను కొందరు నేతలు బినామీల పేర్లపైకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారని, నాలుగైదు రోజులుగా తమకు నచ్చిన కాంట్రాక్టులకు బిల్లులు రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇది ప్రజలకు నష్టం జరిగే విషయం కావడంతో, ఇలాంటి పనులు జరగకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
పార్టీ నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్ సందర్భంగా పార్టీ నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని భట్టి సూచించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా గెలవలేదన్నట్లుగా ప్రకటించారని, ధర్మపురి, హుజూర్ నగర్, మంచిర్యాల, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి వంటి స్థానాలు అతితక్కువ ఓట్లతో సీట్లు కోల్పోయాయని ఆయన తెలిపారు. ప్రజలు కోరుకుంటున్న మార్పు రాబోతుందని, మార్పు కోరుకుంటున్న ప్రజలకు నష్టం జరిగే ఏ ఒక్క ప్రక్రియను జరగకుండా చూడాలని ఆయన సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News