Sunday, January 19, 2025

అధిక వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:జిల్లాలో మూడు రోజులుగా కురుస్తు న్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అ ధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. గురువారం అధికారులతో ఈ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌తోకలిసి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎగువ నుండి మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్న నేపధ్య ంలో గరిడేపల్లి, నేరుడుచర్ల, సూర్యాపేట మండలాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణ నది పరివాహక ప్రా ంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి సిద్ధంగా ఉండాలని అన్నారు. వచ్చే 5 రోజులు జిల్లాలో భారీ వర్షాలు పడే వీలున్నందున రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఎంపిడిఓ, ఎంపిఓలు అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వర్షాల కారణంగా ముందాగనే వరద ముప్పు ప్రాంతాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు:భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ సహాయం కోసం 24/7 కాల్ సెంటర్‌ను కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అత్యవసర సహాయం కోసం 6281492368 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి నష్టం కలగకుండా జిల్లా యంత్రాంగం పరిరక్షణ జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకరెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఓలు,ఎంపిఓలు, ఇరిగేషన్, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News