Wednesday, January 8, 2025

అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ప్యూన్‌బస్తీలో అనుమతులులేకుండా బహుళ అంతస్థుల నిర్మాణం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ప్యూన్‌బస్తీలో అక్రమ నిర్మాణం జరుగుతున్న బహుళ అంతస్థు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో అనుమతులు లేకుండా బడా బాబులు, అధికార పార్టీ నాయకులు నిర్మాణాలు చేస్తున్న మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పేదలు చిన్నపాటి నిర్మాణాలు నిర్మించుకుంటే అత్యుత్సాహం ప్రదర్శించే మున్సిపల్ అధికారులకు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇంత పెద్ద నిర్మాణం జరుగుతున్న కనిపించడం లేదని ప్రశ్నించారు. గతంలో సదరు భవనం నిర్మాణం జరుగుతున్నప్పుడు అనుమతులు లేవని పనులు నిలుపుదల చేశారని మరల ఇప్పుడు నిర్మాణం చేపడుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

సదరు ప్రాంతంలో గతంలో సంజీవని చిట్‌ఫండ్ ఉండేదని చిట్ ఫండ్ నిర్వాహకుడు కోట్ల రూపాయలు వసూలు చేసి పారిపోయాడని, వందలాది మంది బాధితులు పోలీసు స్టేషన్లు, కోర్టు చుట్టూ తిరగరని అటువంటి స్థలంలో నిర్మాణాలు చేపట్టడం సరైంది కాదన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లిఖార్జునరావు, సాయి, వంగా రవిశంకర్, తాటిపాముల హరికృష్ణ,జర్పుల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News