Thursday, December 19, 2024

త్వరలో ‘ఓజి’ షూటింగ్‌లో..

- Advertisement -
- Advertisement -

ఎట్టకేలకు పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవాడలో జరుగుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో తనకు కుదిరినప్పుడు పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలు చూసుకుంటూ వీలు చిక్కినప్పుడు షూటింగ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 28న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. ఇక తాజాగా ఓజి టీం కూడా షూటింగ్ మొదలు పెట్టింది. పవన్ కళ్యాణ్ అవసరం లేని సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ రెండు సినిమాలను చకా చకా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. జూన్ తర్వాత ఓజీ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ప్రస్తుతానికి హరిహర వీరమల్లు, ఓజీ సినిమాకు కాల్షీట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్. అవి అన్ని చకాచకా పూర్తి అయ్యేలా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News