మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”.
తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన “వాసవసుహాస” పాటకు, అలానే ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రం సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడంలో భాగంగా ఈ చిత్ర బృందం Vvit గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్ తో మ్యాచ్ నిర్వహించి. ఆ మ్యాచ్ లో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ప్లేయర్ తో “ఓ బంగారం” అనే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ మ్యాచ్ లో Vvit గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్ 123 కొట్టింది. దానిలో K.సైదులు అనే ప్లేయర్ హాఫ్ సెంచరీ చేయడంతో తనని మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా ప్రకటించి అతనిచే “బంగారం” సాంగ్ ను రిలీజ్ చేయించింది చిత్రబృందం.
ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..
ఖచ్చితంగా ఈ సినిమా బాగా మీకు నచ్చుతుంది. ఈ సినిమా టెక్నీషియన్స్ అందరికి థాంక్యూ సో మ్యాచ్. మా ప్రొడ్యూసర్ వాసు గారు ఈ సినిమాను మీకు దగ్గర చెయ్యాలని చెప్పి నెల ముందు నుంచి ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. భాస్కరభట్ల గారు నాకు మంచి లిరిక్స్ ఇచ్చారు. అబ్బాయిలకు మ్యాచ్ పెట్టారు, మరి అమ్మాయిలకు సంబంధించి ఏమున్నాయి అంటే…
దీనికి బన్నీవాసు స్పందించి….
ఈ సాంగ్ ను రీల్ గా చేసి గీతా ఆర్ట్స్ ను ట్యాగ్ చేస్తే, సెలెక్ట్ అయినా 10 మందికి వాళ్ళ ఫ్యామిలీ కి ఈ సినిమాను చూపించి. వాళ్ళను పుష్ప షూటింగ్ కి కూడా తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు.
ఓ బంగారం నీ చెయ్యి తాకగానే
ఉప్పొంగిపోయిందే నా ప్రాణం అనే ఈ పాటను
భాస్కరభట్ల రచించారు.
“కాటుక కనులే, పుట్టిస్తుంటే కలలే
వదిలెదెట్టేగా ఓ మైనా
నీ వల్లే మొదలే తిక్క తిక్క పనులే
దిల్ రుబా మోగిందే నాలోనా’ వంటి పాటలోని లైన్స్ ఆకట్టుకున్నాయి.
ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించారు.
మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాతలు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది.