Thursday, December 26, 2024

మహేష్ బాబుతో శ్రీలీల రోమాన్స్.. 13న ‘ఓ మై బేబీ’ సాంగ్

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ గుంటూరు కారం. ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, జగపతి బాబు, రఘుబాబు, సునీల్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు చేస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా… అందరినీ ఎంతో ఆకట్టుకుంది.

‘ఓ మై బేబీ’ అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ప్రోమోని ఈనెల 11న సాయంత్రం 4 గం.ల 5 ని.లకు, అలానే ఫుల్ లిరికల్ వీడియోను ఈనెల 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బుగ్గపై శ్రీలీల ముద్దు పెడుతున్న ఈ సెకండ్ సాంగ్ రొమాంటిక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గుంటూరు కారం మూవీ జనవరి 12న గ్రాండ్‌గా భారీ స్థాయిలో ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News