Thursday, January 16, 2025

అమెరికాను వణికిస్తున్న గూడ్సు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలోని ఓహియో ప్రాంతంలో ఇటీవల జరిగిన గూడ్సు ప్రమాదం ఆ ప్రాంత ప్రజలకు ఆందోళనకరంగా మారింది.ఆ ప్రమాదం కారణంగా అత్యంత ప్రమాదకరమైన గ్యాస్‌లు వాతావరణంలో కలిశాయి. దీంతో అక్కడి ప్రజలు బాటిళ్లలోని నీటినే తాగాలని ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ కోరారు. ఓహియోపెన్సిల్వేనియా రాష్ట్రాల మధ్య ఈస్ట్ పాలస్టైన్ అనే గ్రామం వద్ద ఈ నెల4న ఓ గూడ్సురైలు ప్రమాదానికి గురైంది. దీంతో 50 బోగీలు పట్టాలు తప్పాయి. ఆ రైలులో అత్యంత ప్రమాదకరమైన వినైల్ క్లోరైడ్ గ్యాస్‌ను తరలిస్తున్నారు. ప్రమాదం అనంతరం ఆ బోగీలు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. ఆ గ్యాస్‌లలో క్యాన్సర్ కారకాలుంటాయని అమెరికా నేషనల్ క్యాన్సర్‌ సెంటర్ హెచ్చరించింది. దీంతో ప్రమాదం జరిగిన చోటునుంచి దాదాపు మైలుదూరం వరకు గాల్లో చోటు చేసుకుంటున్నమారులను అమెరికా గమనిస్తోంది.

దాంతో పాటుగా ఆ ప్రదేశంలోని భూగర్భ జలాలను కూడా పరీక్ష చేయిస్తోంది. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ మాట్లాడుతూ ప్రస్తుతానికి అక్కడి బోర్లలో నీటిని తొలివిడతగా పరీక్షించగా ఎలాంటి ఇబ్బందీ లేదని తేలిందని చెప్పారు.అయితే మరిన్ని ఫలితాలు అందాల్సి ఉందని, అప్పటివరకు బాటిల్ నీళ్లనే ఉపయోగించాలని సూచించారు. మరో వైపు ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న నదులు, కాల్వల్లో ని నీటిని సైతం పరీక్షల కోసం సేకరిస్తున్నారు. 150 బోగీలతో మాడిసన్‌నుంచి బయలుదేరిన ఈ గూడ్సుపెన్సిల్వేనియాలోని కాన్వేకు చేరుకోవలసి ఉంది. దీనిలో 11 బోగీల్లో వినైల్ క్లోరైడ్, బ్యూటైల్ అక్రలేట్ వంటి ప్రమాదకర కెమికల్స్‌ను తరలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలోని వేలాది మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అయితే అయిదు రోజుల తర్వాత వారంతా ఇళ్లకు తిరిగి వెళ్లడానికి అనుమతించారు. కాగా వీరిని ఖాళీ చేయించడానికి అయిన ఖర్చుల కింద కుటుంబాలకు, వ్యాపారసంస్థలకు 1.5 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు ప్రమాదానికి గురైన గూడ్సురైలు సంస ్థనోర్‌ఫోక్ సదరన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే ప్రమాదానికి సంస్థదే పూర్తి బాధ్యత అని, అన్నిటికీ అయ్యే ఖర్చును ఆ సంస్థే భరించాలని గవర్నర్ మైక్ డివైన్ అంటున్నారు. సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు కూడా ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News